Roja (photo/YSRCP/X)

Vjy, Jan 9: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.అయితే ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా (Roja on Tirupati Stampede) విచారం వ్యక్తం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు?. సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్‌ స్పందన ఏది?. నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు.

తొక్కిసలాట వల్ల కాదు, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

‘‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే గతంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు అసమర్థత, వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉంది. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలి’’ అని రోజా పేర్కొన్నారు.

Roja on Tirupati Stampede

పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారు. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే. అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారు. మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలి. 105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా.. 194 సెక్షన్ ఎలా పెడతారు?. ఏడుగురు భక్తులు చనిపోతే.. హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు?. ఆ పీఠాధిపతులు బయటకు రావాలి. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయాలి. మోదీ కూడా దీనిపై స్పందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయి. సనాతన యోధుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?’’ అంటూ రోజా ప్రశ్నించారు.