Kamma Rajyam Lo Kadapa Reddlu: కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ మార్చినా, విడుదలకు స్టే విధించిన హైకోర్ట్
ఈ సినిమాలో మీలాంటి రాజకీయాలకు దండం పెడతారు, కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు....
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' (Kamma Rajyam Lo Kadapa Reddlu) ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, అందుకు తెలంగాణ హైకోర్ట్ (High Court of Telangana) బ్రేక్ వేసింది. ఈ సినిమా టైటిల్ కమ్మ మరియు రెడ్డి సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, అంతేకాకుండా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లాంటి నేతలను కించపరిచేలా ఈ సినిమాలో పాత్రలు ఉన్నాయని పిటిషనర్లు హైకోర్టుకు తెలపారు.
అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదని అలాగే సినిమా టైటిల్ ను 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని మారుస్తామని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్, వారం రోజుల్లో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా సినిమాలోని వివాదాస్పద అంశాలకు సంబంధించి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించింది. అలాగే టైటిల్ కూడా మార్చాలని నిర్ధేషించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
అయితే వర్మ మాత్రం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. మీ కుటిల రాజకీయాలకు దండం పెట్టాలి, కమిడియన్ల కంటే లీడర్లే బెస్టు అనే లిరిక్స్ తో సాగే 'దండం' పాటను విడుదల చేశారు.
Dhandam Full Video Song:
కాగా, హైకోర్ట్ తాజా తీర్పుతో 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. కోర్ట్ ఆదేశాలతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాలో ఎన్ని కత్తెరలు వేస్తుందో చూడాలి.