Allu Arjun on Rajinikanth: రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్‌ మాటల్లో..

ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను.

Allu Arjun and Rajanikanth

గంగోంత్రితో సినిమా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారి జాతీయ ఉత్తమనటుడిగా ఎదిగాడు. ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.  ఓ సందర్భంలో అల్లు అర్జున్  ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను. అప్పుడు అక్కడ రజనీకాంత్, శంకర్‌ కలయికలో రాబోతున్న రోబో షూటింగ్‌ జరుగుతోంది.

ఆ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేస్తున్న రత్నవేలు మా ఆర్య సినిమాకు కూడా కెమెరామెన్‌గా పనిచేశాడు. ఆయన్ని కలిసి మాట్లాడాం. ఆ సమయంలో రజనీని కలవాలని వున్నా మళ్లీ నేను అల్లు అరవింద్‌ అబ్బాయినని చెప్పి గుర్తు చేసి మాటలు కలపడం ఎందుకులే అనిపించి అక్కడి నుంచి బయటకు వస్తున్నాను. ఇంతలో ఎవరో వచ్చి మిమ్మల్ని రజనీకాంత్‌ గారు రమ్మంటున్నారు అని చెప్పారు.  తిరుమల శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు, దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ

వెంటనే నేనూ నా దర్శకుడు సుకుమార్‌ వెళ్లి కలిశాం. నేను సినిమాల్లో నటిస్తున్న సంగతి ఆయనకు తెలుసో లేదో అనుకున్నా.. కానీ ఆయన మాత్రం సినిమాలు బాగా చేస్తున్నావయ్యా లేడిస్‌లో నీకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వుంది. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్‌ సంపాందించుకున్నావు అనే సరికి నేను ఒక్కసారిగా షాకయ్యాను. రజనీకాంత్‌ నా గురించి అలా మాట్లాడేసరికి ఆక్షణం నాలో తెలియని ఆనందం కలిగింది అని చెప్పుకొచ్చారు.



సంబంధిత వార్తలు

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif