Johnny Wactor Shot Dead: హలీవుడ్‌ ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్‌పై కాల్పులు జరిపిన దుండగులు, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Johnny Wactor

హలీవుడ్‌ ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్‌(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని  పికో బౌలేవార్డ్,  హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రముఖ నటి లైలా ఖాన్ హత్య కేసులో సవతి తండ్రికి ఉరిశిక్ష, 13 సంవత్సరాల తర్వాత కీలక తీర్పును వెలువరించిన ధర్మాసనం

కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.వాక్టర్‌ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. వెస్ట్‌వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్‌డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే',  క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్‌లలో అతిథి పాత్రలో కనిపించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif