Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల, నిరాధారమైన ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించిన జూనియర్ ఎన్టీఆర్
అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా సమంత, నాగచైతన్య తీవ్రంగా ఖండించారు.తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక తాజాగా నాగార్జున, అమల, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
Hyd, Oct 3: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా సమంత, నాగచైతన్య తీవ్రంగా ఖండించారు.తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక తాజాగా నాగార్జున, అమల, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగార్జున...గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి... దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అని సూచించారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అన్నారు నాగ్. కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్, ఫైర్ బ్రాండ్‌ని నిద్ర లేపి తన్నించుకుంటున్నారంటున్న కాంగ్రెస్, ఎవరేమన్నారంటే..
Here's Tweet:
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు హీరో జూనియర్ ఎన్టీఆర్. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగి దిగజారిపోయారు.. మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. సినిమా పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చూసి బాధగా ఉంది..ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం మౌనంగా కూర్చోము అని తేల్చిచెప్పారు.
Here's NTR Tweet:
కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు అక్కినేని అమల. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై మండిపడ్డారు అమల. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలన్నారు అమల.
Here's Amala Teet: