Thellavarithe Guruvaram Event: తెల్లవారితే గురువారం..ఎమోషనల్ అయిన జూనియర్, జక్కన్న, కీరవాణిల కుటుంబంపై ప్రశంసలు, కొడుకులు గొప్పోళ్లు అయితే తండ్రి ఆనందం ఇలానే ఉంటుందని తెలిపిన ఎన్టీఆర్
నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం, స్థానం గురించి మాట్లాడటానికి మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నా.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహా కోడూరి నటించిన రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ విడుదలకు రెడీ అయ్యింది. ‘మత్తు వదలరా’ చిత్రంతో నటుడిగా గుర్తింపు సంపాదించిన శ్రీసింహా.. ‘తెల్లవారితో గురువారం’ అనే వెరైటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమూవీ (Thellavarithe Guruvaram Pre Release Event) ప్రచారకార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ (Jr NTR Powerful Speech) మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిలు అభయ్, భార్గవ్ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో.. నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం, స్థానం గురించి మాట్లాడటానికి మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నా. వాళ్లిద్దర్నీ చూసి ఈరోజు నేనెలా ఫీలవుతున్నానో భవిష్యత్తులో అభయ్, భార్గవ్‌లను చూసి ఇంతే ఆనందపడతానేమో.
నా మంచీ చెడుల్లో, కష్ట సుఖాల్లో, నా ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నలదే. ‘తెల్లవారితే గురువారం’ తో మా భైరవ, మా సింహా ఇంకో మెట్టు పైకి ఎదిగాలని, మణికాంత్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే (ఫ్యాన్స్).. నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం మా కీరవాణి, జక్కన్న (రాజమౌళి) కుటుంబం’’ అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
ఈరోజు వీళ్లని చూసి నేను ఎంత ఆనందపడుతున్నానో.. రేపటి రోజున భార్గవ్, అభయ్ (ఎన్టీఆర్ కొడుకులు)లను చూసి ఇంతే ఆనంద పడతానేమో. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి అనో.. ఇంకేదో అని అనవసరమైన మాటలు ఏవో మాట్లాడేశారు కానీ.. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడు ఇచ్చిన శక్తి మీరైతే నాకు దేవుడు ఇచ్చిన కుటుంబం మా కీరవాణి, జక్కన్న కుటుంబం. నా మంచి చెడ్డలలో, సుఖ దుఖాలలో.. నేను నా జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉన్న ఒకే ఒక్క కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను ఇక్కడికి ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను. నేను ఏరోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాను.. కాలేను.. కాకూడదు కూడా అని అన్నారు.
వేగంగా పరిగెడుతున్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పెద్ద టాస్క్. మనం మంచి పేరెంట్స్ ఎలా అవుతాం అనే డౌట్ నాకు, ప్రణతి (ఎన్టీఆర్ భార్య)కి రోజూ వస్తుంటుంది. ఎలా చేద్దాం అనిపించిన ప్రతిసారీ నాకు గుర్తొచ్చేది ఇద్దరే.. మా శ్రీవల్లి, రమగార్లు. ప్రతి కొడుకు విజయం వెనకాల ఓ తల్లి ఉంటుంది. నా పిల్లలకు మంచి ఉదాహరణలు కాలభైరవ, సింహా, కార్తికేయ. వీళ్ల సక్సెస్‌కి కారణం శ్రీవల్లి, రమగార్లు’’ అన్నారు. ఈ సక్సెస్ సినిమాలకే పరిమితం కాకుండా.. రేపు వచ్చే యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ –‘‘బయటివారు ఎలా చేశారో ఈజీగా చెప్పేస్తుంటాం.. కానీ ఇంట్లో పిల్లల గురించి చెప్పాలంటే టెన్షన్‌గా ఉంటుంది. మా పిల్లలు బాగానే చేశారనిపిస్తుంటుంది. కానీ ఎలా చేశారన్నది సినిమా చూశాక మీరు చెప్పాలి. కాలభైరవ విషయంలో నాకు టెన్షన్ లేదు. క్లాస్, మాస్ సాంగ్స్ ఇరగ్గొట్టేస్తున్నాడు. చిన్నోడు కాబట్టి శ్రీసింహాకి కొంచెం భయం.. మీరు తొందరగా ఆ భయాన్ని పోగొడతారని ఆశిస్తున్నా. ఈ సినిమాని నిర్మాతలు గ్రాండ్‌గా నిర్మించారు.. మొదటి సినిమా అయినా మణికాంత్ బాగా తీశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ –‘‘తండ్రులు రెండు రకాలుంటారు.. వారిలో గూగుల్ మ్యాప్ ఫాదర్స్ ఒకరు.. అలా వెళ్లు, ఇలా వెళ్లు అంటూ పిల్లలకు గైడెన్స్ ఇస్తుంటారు. కానీ నేను నా పిల్లల కెరీర్ తొలి నాళ్లలో ఏం చేయాలో చెప్పానంతే.. ఇప్పుడు వారి పనిలో కల్పించుకోవడం లేదు’’ అన్నారు. ‘‘మీరందరూ వచ్చి మా సినిమా ‘అదుర్స్’ అంటే చాలు’’ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ అరిచి గోల చేయడంతో.. వాళ్లని జూనియర్ వారించారు ఎన్టీఆర్ స్టేజ్ మీదికి వచ్చినప్పటి నుంచి.. వేరేవాళ్లు మాట్లాడుతున్నా సీఎం సీఎం అని గోల చేయడంతో ఎన్టీఆర్ కాస్త అసహనానికి గురయ్యారు. పలుమార్లు వారించిన ఆయన.. గోల ఆపమని చెప్పాను.. అంటూ అభిమానులపై సీరియస్ అయ్యారు ఎన్టీఆర్.