Jr NTR (Photo Credits: Twitter)

బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసి బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు. నాగార్జున, నాని వంటి హోస్ట్‌లతో అలరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ఈ సారి జెమినీ టీవీలో ప్రసారం కావడం జూనియర్ హోస్ట్ చేస్తుండటంతో ఈ షో కోసం కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ షోకు సంబంధంచిన ప్రోమోను జెమిని టీవీ తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో శుక్రవారం ప్రెస్‌మీట్‌ (Evaru Meelo Koteeswarulu Press Meet) జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు. ‘మీ పోలిటికల్‌ ఎంట్రీ ఎప్పడు’అని (JR NTR Political Entry Row) ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు నేను ఏ సమాధానం చెబుతానో కూడా మీకు తెలుసు’ అంటూ ప్రశ్న దాటేశారు. అయితే రాజకీయాల (Jr NTR Responds Over His Political Entry) గురించి మాట్లాడేందుకు ఇది సమయం, సందర్భం కాదని, దీని గురించి మరొసారి తీరిగ్గా కాఫీ తాగుతూ చర్చించుకుందామంటూ సమాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన కొమురం భీం పాత్ర‌లో కనిపించనున్నాడు.

ఎవరు మీలో కోటీశ్వరులు ? సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు అంటూ ప్రోమో, త్వరలో జెమెని టీవీలో ప్రారంభం కానున్న షో

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌‌ రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. తదుపరి ఎన్నికల నాటికి ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు దీనిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒక వర్గం అభిమానులు అయితే ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. అటు బాలయ్య సీనియర్ అయిపోయారు, ఇటు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఇవ్వలేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ ఆశాజనకంగా సాగటంలేదు. ఈ క్రమంలో నందమూరి కుటుంబ అభిమానులుగా తమకు ఎన్టీఆర్ ఇంకొంతకాలం వెండితెరపైనే వినోదం పంచాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే ఎంతో ఘనచరిత్ర ఉన్న టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కుంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో ఎరుగని ఓటమిని మూటగట్టుకున్న పార్టీ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బొక్కబోర్లాపడింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో కూడా పార్టీ ఓటమి పాలయ్యింది. దీంతో అటు నాయకులతో పాటు కార్యకర్తలు కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఈ క్రమంలోనే తారక్ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి రావాలని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకి సంబంధించిన ప్రోమో శనివారం విడుదల అయింది. జెమినీ టీవీ అఫీషియల్‌గా ఎన్టీఆర్ లుక్‌ ప్రమోను శనివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది. ఈ షో జెమిని టీవిలో వారాంతంలో ప్రసారం కానుంది. ప్రతి శనివారం, ఆదివారం ప్రసారం చేేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వం ఉంది.

Here's jr NTR Tweet

మీలో ఎవరు కోటీశ్వరుడు' తరహాలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షోను జెమిని స్టార్ట్ చేసింది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారా ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. మాటల మాంత్రకుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోమోను రెడీ చేశారు. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' సంబంధించిన షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగింది.

జెమినీ గ్రూప్ కు చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ లో కూడా ఈ షో ప్రసారం కానుంది. ఈ షో నిమిత్తం జూనియ‌ర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ రావడంతో.. తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో చేస్తున్నారు. అక్కినేని నాగార్జున అప్పట్లో హోస్ట్‌గా 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ వచ్చిన పొగ్రాం గుర్తుండే ఉంటుంది. గ‌తంలో నాగార్జున‌ తర్వాత సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా అల‌రించారు. ఆ షోలో ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

జెమిని టీవీ గతంలో విడుద‌ల చేసిన ప్రోమోలో చైర్‌లో హోస్ట్ కూర్చుని ఉన్నారు. అయితే, ఆయ‌న ముఖాన్ని నేరు చూప‌కుండా ఓ షాడోను చూపించారు. దాన్ని గ‌మ‌నించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన హీరోను గుర్తుపట్టేశారు. ఈ షో తాలుకు ప్రోమోను వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాజాగా ఈ షో కి చెంందిన అధికారిక ప్రకటన రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.