Kalki 2898 AD Trailer Release: ట్రైల‌ర్ రిలీజ్ కంటే ముందుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన క‌ల్కీ టీమ్, దీపికా ప‌దుకొనె పోస్ట‌ర్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కులకు ప‌జిల్

ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో స‌హాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా దీపికా ఉంది.

Kalki 2898 AD

Hyderabad, June 09: టాలీవుడ్ నుంచి వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల‌లో ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) ఒక‌టి. పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై (Vyjayanthi Movies) అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 27న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌భాస్ అభిమానులు ట్రైల‌ర్ (Kalki 2898 AD Trailer) కోసం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే.

 

ఈ మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే ట్రైల‌ర్ రేపు విడుద‌ల కానున్న‌ట్లు తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా నుంచి దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో స‌హాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా దీపికా ఉంది.