Kangana Ranaut Corona: కంగనాకు కరోనా పాజిటివ్, వైరస్‌ని నాశనం చేసి పడేస్తానని చెబుతున్నబాలీవుడ్ నటి, రండి కలిసి ఈ వైరస్‌ను నాశనం చేద్దామంటూ పిలుపు
ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'గత కొన్ని రోజులుగా శరీరం చాలా బలహీనంగా, కళ్లు కూడా మండుతున్నట్లు అనిపించింది
Mumbai, May 8: బాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Kangana Ranaut Tests Positive for COVID-19) అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'గత కొన్ని రోజులుగా శరీరం చాలా బలహీనంగా, కళ్లు కూడా మండుతున్నట్లు అనిపించింది .హిమాచల్‌ప్రదేశ్ వెళ్తాం అనుకున్నాం. సో ముందు జాగ్రత్తగా టెస్టు చేయించుకోగా నేడు (శనివారం)టెస్టు రిపోర్ట్స్ వచ్చాయి. అందులో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే క్వారంటైన్ అయిపోయాను.
ఈ వైరస్ నా శరీరంలోకి ఎలా ప్రేవేశించిందో కొంచెం కూడా ఐడియా లేదు. కానీ ఇప్పుడు నేను ఈ వైరస్‌ను నాశనం చేయగలను. మీరు కూడా వైరస్‌కు భయపడకండి. ఒకవేళ మీరు భయపడితే ఆ వైరస్ మిమ్మల్ని ఇంకా భయపెడుతుంది. ఇది జస్ట్ చిన్న ఫ్లూ.. తప్పా మరేం కాదు కాబట్టి రండి కలిసి ఈ వైరస్‌ను నాశనం చేద్దాం' అని పేర్కొంది. కొవిడ్ 19 అంటే భయపడేంత ఏమీ లేదు. చిన్నపాటి ఫ్లూ మాత్రమే, అయితే ప్రజలను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోంది’’ అన్నారు కంగనా రనౌత్.
ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉండే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ (Kangana Ranaut's Twitter account suspended) చేసిన సంగతి విదితమే. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు (Kangana Ranaut Twitter suspended) చేసింది. ట్విట్టర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ట్విట్టర్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘తెల్లతోలు ఉన్నవారు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారు’’ అంటూ ట్విట్టర్ యాజమాన్యంపై మాటల దాడి చేశారు. సస్పెన్షన్ తర్వాత మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అకౌంట్ ఇది కాకుంటే మరెన్నో మార్గాలు ఉన్నాయని, నా వాయిస్ ని చెప్పడానికి ఇతర మార్గాలు అనేకం ఉన్నాయని ఆమె తెలిపారు.