Varaaha Roopam Song: కాంతార నిర్మాతలకు కోర్టులో ఎదురుదెబ్బ, వరాహరూపం పాటను వెంటనే నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశం, అన్ని స్ట్రీమింగ్ ఫ్లాట్‌ ఫామ్‌ల్లో నిలిచిపోనున్న వరాహరూపం సాంగ్, ఇంకా స్పందించని మూవీ టీమ్

ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Screen garb from Video song

Bangalore, OCT 29: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార సినిమా (Kantara) ఎంత పెద్ద భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదట కన్నడలో రిలీజయి మంచి విజయం సాధించిన తర్వాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటికే దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో వరాహ రూపం (Varaha Roopam) పాటకి వాడిన మ్యూజిక్ మాదే, మా మ్యూజిక్ ని కాపీ (Copy music) కొట్టారు, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ కర్ణాటకకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ (Thaikudam Bridge) అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే కోర్టులో పిల్ వేసింది. వరాహరూపం పాటకి వాడిన మ్యూజిక్ మాదే అంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ కాంతార చిత్ర యూనిట్ పై పలు ఆరోపణలు చేసి కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టులో పిల్ వేయగా విచారించిన కోర్టు దీనిపై తీర్పునిస్తూ కాంతార టీంకి షాకించ్చింది.

Rajini Movie Updates: లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్.. నవంబరు 5న పూజా కార్యక్రమాలు.. ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీ 

కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో ‘వరాహ రూపం’ (song Varaaha Roopam) పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతార సినిమా నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Ram Gopal Varma Tweet: వర్మ వ్యూహం సినిమా మరో వైరల్ ట్వీట్, BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం అంటూ గుట్టు విప్పిన దర్శకుడు 

ఈ పాటని అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు.. అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్, మరియు ఇలాంటి వాటిల్లో పూర్తిగా నిలిపివేయాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, కోజికోడ్ ఆదేశాలిచ్చారు.  అయితే దీనిపై కాంతార చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. ఆ పాటని అన్నిట్లో తీసివేసే విధంగా కాంతార చిత్ర యూనిట్ చర్చలు చేపట్టనున్నట్టు సమాచారం.



సంబంధిత వార్తలు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

YS Jagan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన జగన్, ఈ ఘటనకు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్న వైసీపీ అధినేత

Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్‌ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్

Coolie Video Out: ర‌జ‌నీకాంత్ కొత్త మూవీ కూలీ నుంచి మాస్ వ‌చ్చేసింది! 74 ఏళ్ల వ‌య‌స్సులోనూ త‌లైవాలో త‌గ్గ‌ని జోష్