Jailer Villain Arrested: జైలర్ విలన్ అరెస్ట్, ఫుల్లుగా తాగి న్యూసెన్స్ చేసిన వినాయకన్, అపార్ట్ మెంట్ వాసుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు
మద్యంమత్తులో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు ఆయనను స్టేషన్‌కు పిలిపించారు.
Ernakulam. OCT 25: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ (Jailer) సినిమాలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను (Vinayakan) కేరళ పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. మద్యంమత్తులో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు ఆయనను స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న వినాయకన్ వారితో గొడవకు దిగినట్లు తెలుస్తున్నది.
ఎంతగా వారించినప్పటికీ వినకపోవడంతో కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. కాగా, గతంలోనూ ఓ మోడల్‌ను వేధించినందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు.
మలయాళ నటుడైన వినాయకన్.. జైలర్ సినిమాలో రజనీకాంత్‌తో పోటీపడి నటించిన విషయం తెలిసిందే. ఆయన తెలుగులోనూ ఓ సినిమాలో కనిపించారు. కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అసాధ్యుడు మూవీలో ఆయన టాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు.