Liger: మైక్‌ టైసన్ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేసిన లైగర్ టీమ్, టైసన్ పంచ్ అదుర్స్‌ అంటున్న ఫ్యాన్స్

ఈ మూవీ నుంచి వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) లుక్ రిలీజ్ చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్రలో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లైగ‌ర్ (Liger). ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

Hyderabad, Novermber 4: దీపావళికి ఫ్యాన్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది లైగర్ టీమ్. ఈ మూవీ నుంచి వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) లుక్ రిలీజ్ చేసింది.

 

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్రలో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లైగ‌ర్(Liger). ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ చిత్రంలో డ్యాన్స్ చేయ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే దానికి సంబంధఙంచిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

లైగర్ మూవీలో మైక్‌ టైసన్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్న విషయం స్పష్టం చేయలేదు మూవీ టీమ్. కానీ టైసన్ లుక్ అదిరిపోయిందంటున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా మైక్ టైస‌న్ లుక్ విడుద‌ల చేస్తూ దీపావ‌ళి శుభాకాంక్షలు తెలియ‌జేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో మైక్‌ టైసన్‌.. చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు.