Good Newwz: బెడ్ రూంలో సర్జికల్ స్ట్రైక్, పిల్లలు పుట్టకపోవడంపై దంపతుల బేజార్, రిపోర్టుల తారుమారుతో ఒకరి భార్యపై మరొకరి ప్రత్యేక కేర్, నవ్వుల్లో ముంచేస్తున్న 'గుడ్ న్యూస్' ట్రైలర్

రెండవ జంటకు చెందిన భర్త మొదటి జంట భార్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. దీంతో ఆ భర్త కోపంతో నా భార్యపై నీకెందుకురా అంత ప్రేమ అంటే, నీ భార్య కడుపులో పెరిగేది నాకు పుట్టబోయే బిడ్డ. నా క్వాలిటీస్, నా నాణ్యత....

Good Newwz: బెడ్ రూంలో సర్జికల్ స్ట్రైక్, పిల్లలు పుట్టకపోవడంపై దంపతుల బేజార్, రిపోర్టుల తారుమారుతో ఒకరి భార్యపై మరొకరి ప్రత్యేక కేర్, నవ్వుల్లో ముంచేస్తున్న 'గుడ్ న్యూస్' ట్రైలర్
Good Newwz | (Photo Credits: (Dharma Productions)

తమకు పిల్లలు కలగడం లేదని మిస్టర్ అండ్ మిసెస్ బత్రా ఫెర్టిలైజేషన్ క్లినిక్‌కు వెళ్తారు. అయితే సమస్యకు పరిష్కారంగా డాక్టర్ కృత్రిమ గర్భాధారణ (in vitro fertilization) పద్ధతిని సూచిస్తారు. ఈ బత్రా ఫ్యామిలీతో పాటే, అదే పేరుతో గల మరో జంట కూడా క్లినిక్ కు వస్తారు. వారికి కూడా డాక్టర్ అదే పద్ధతిని సూచిస్తారు. దీనికి ఆ రెండు జంటలు అందుకు అంగీకరిస్తాయి. అయితే పేర్లు ఒకే రకంగా ఉండటంతో వైద్య సిబ్బంది కన్ఫ్యూజ్ అయి, ఒక భర్త యొక్క శుక్రకణాలను అతడి భార్యకు కాకుండా వేరొకరి భార్యకు పంపిస్తారు. ఇలా ఇరు జంటలకు శుక్రకణాల తారుమారు అవుతుంది. ఫలితంగా వారిద్దరూ గర్భం దాలుస్తారు. కానీ ఒకరికి సంబంధించిన బిడ్ద మరొకరి తల్లి గర్భంలో పెరుగుతుంది.

దీంతో రెండవ జంటకు చెందిన భర్త మొదటి జంట భార్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. దీంతో ఆ భర్త కోపంతో నా భార్యపై నీకెందుకురా అంత ప్రేమ అంటే, నీ భార్య కడుపులో పెరిగేది నాకు పుట్టబోయే బిడ్డ. నా క్వాలిటీస్, నా నాణ్యత, నా కష్టార్జితం అంతా నీ భార్య కడుపులో పెరుగుతుంది అంటూ బదులిస్తాడు, అలా అయితే నీ భార్య కడుపులో కూడా నా బిడ్డ పెరుగుతుంది కదా అని అంటాడు. ఇలా ఇరు జంటల మధ్య సాగే గొడవలు పిచ్చి కామెడీని పంచుతున్నాయి. ఈ కథంతా బాలీవుడ్‌లో రాబోతున్న 'గుడ్ న్యూస్' (Good Newwz) సినిమాకు సంబంధించింది. హిలేరియస్‌గా ఉన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

Check Out The Trailer Of Good Newwz Below: 

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మరియు కరీనా కపూర్ ఖాన్ (Akshay Kumar and Kareena Kapoor Khan) ఒక జంటగా, మరియు కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ (Kiara Advani and Diljit Dosanjh ) రెండో జంటగా నటిస్తున్నారు. కామెడీ + డ్రామా రెండు కలిపిన 'డ్రామెడీ' (dramedy) జోనర్ లో దర్శకుడు రాజ్ మెహతా ఈ గుడ్ న్యూస్  సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్నో సిట్యువేషనల్ కామెడీ సీన్లతో పాటు మంచి కథతో సినిమాను రూపొందిస్తున్నట్లు సినిమా యూనిట్ వారు చెప్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 27న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)


సంబంధిత వార్తలు

Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇదిగో, అభిమానులకు పుల్ గేమ్, మరి ప్రేక్షకులకు ఈ గేమ్ బాగా నచ్చిందా లేదా ? శంకర్ మొదటి తెలుగు సినిమా ఎలా ఉందో చూద్దామా..

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

ACB Questions Arvind Kumar: ఆరు గంటల పాటు ఏసీబీ కార్యాలయంలో అరవింద్ కుమార్ విచారణ..ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

Share Us