MAA Elections 2021: కౌగిలింతలు, కొరుకులాటలు మధ్య మా ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించిన పలువురు ప్రముఖులు, సాయంత్రం వెలువడనున్న మా ఎన్నికల ఫలితాలు
శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ (MAA Elections 2021) ప్రారంభమైంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు మోహన్ బాబు, దర్శక రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి, సాయి కుమార్, మంచు లక్ష్మీ, వడ్డే నవీన్, శ్రీకాంత్, వీ కే నరేశ్, శివ బాలాజీ, ఉత్తేజ్, జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ తమ ఓటు హక్కును ( Casts His Vote In Maa Elections) వినియోగించుకున్నారు. మా అధ్యక్ష పదవికోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు తమ ప్యానల్ అభ్యర్థులతో బరిలో దిగుతున్నారు
ఓటేసిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. ఓటర్లు ఎవరూ గెలిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు. ఎవరూ గెలిచిన ఓడినా అందరం కలిసి కట్టుగా ఉంటామని, ‘మా’ను ఒక లెవల్‌కు తీసుకెళ్తాం అన్నారు. ఏకగ్రీవంపై వస్తున్న వార్తలకు ఆయన స్పందిస్తూ.. ప్రజాస్వాయ్య పద్దతి ప్రకారం ఎన్నికలు జరగడం అనివార్యమని, దానిని ప్రతి ఒక్కరు ఆనందంగా స్వాగతించాలన్నారు. అలాగే సభ్యుల మధ్య నెలకొన్ని విమర్శలు, దూషణలపై కూడా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇవన్ని సహజమని, ఆ తర్వాత అందరం కలిసి కట్టుగా మా సమస్యలను పరిష్కరించుకుంటామని చిరంజీవి పేర్కొన్నారు.
Here's MAA Elections 2021 Visuals
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో (MAA Elections ) పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు.
ఏపీ ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ‘మా’ సభ్యులు వ్యక్తిగత దూషణలు చేసకోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ‘ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయి. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. రెండు ప్యానళ్లో నాతో పని చేసిన వారు, తెలిసిన వారు ఉన్నారు. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలి.
సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళ్లాలి. చివరికి అందరం కలిసి కట్టుగా ఉండి మన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. కళాకారులకు, ఆర్టిస్ట్‌లుకు పూర్వ వైభవం రావాలి. ఇకనైనా వెంచర్స్ పాలిటిక్స్ ఆపెయండి. గతంలోని పాలకవర్గంలో పెద్దవారిని, గోప్ప నటులను ఆదర్శంగా తీసుకోని పరిశ్రమను అభివృద్ది వైపు నడిపించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం.
శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందన్నారు. తనకు బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని, పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న వ్యక్తిని పట్టుకోబోతున్న క్రమంలో వాగ్వాదం జరిగిన మాట వాస్తవమనేనని శివబాలాజీ చెప్పారు.
పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. దాంతో 'మా' ఎన్నికల అధికారి.."గొడవలు కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తాం..పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగింది. ప్రకాష్‌రాజ్ తరపున ఒకరు దొంగ ఓటు వేశారు. మోహన్‌బాబు ఇతరులపై అరుస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదులుంటే ఇవ్వండి.. ఎదుటివారిపై అరుపులు చేయొద్దు. బయటివారు వచ్చి లోపల ప్రచారం చేస్తే ఎన్నికలు రద్దు చేస్తాం" 'మా' ఎన్నికల అధికారి ఇరు వర్గాలను హెచ్చరించారు.
మా’ ఎన్నికల ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఈ క్రమంలో నాగబాబు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బైటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఓటేశారని ప్రశ్నించగా.. మూడు రోజుల నుంచి చెబుతున్నా.. కొత్తగా ఏం చెబుతానని, ప్రకాశ్ రాజ్ ప్యానల్ కే తాను ఓటేశానని , తద్వారా ప్రజాస్వామ్యానికే ఓటేశానని ఆయన తెలిపారు.
ఎన్నికలన్నతర్వాత పోటీ ఉంటుందని, తర్వాత అందరూ మళ్లీ కలిసిపోతారని నటుడు విజయ్‌చందర్ అన్నారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ నటీ నటులు అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో ‘మా’లో అద్భుతాలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు.. ఇప్పుడు ఎన్నికలు మరో ఎత్తని అన్నారు.
నటీనటులు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడం మంచి విషయమని ప్రకాశ్ రాజ్ అన్నారు. ‘మా’ పోలింగ్ సందర్భంగా ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. గెలుపును నిర్ణయించేది ఓటర్లేనన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నరేశ్ తో గొడవపై ఆయన వివరణ ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. ఇంట్లో కౌగిలికి ఎన్నో అర్థాలుంటాయని నవ్వుతూ చెప్పారు.
కాగా, పోలింగ్ వద్ద గందరగోళం కారణంగా అధికారులు కాసేపు పోలింగ్ ను ఆపేశారు. పోలింగ్ బూత్ లోకి ప్రకాశ్ రాజ్ గన్ మెన్లు రావడంతో విష్ణు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే నరేశ్, ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ జరిగింది. మోహన్ బాబు వారిని నిలువరించారు. ఇప్పటిదాకా 220 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్న ఈ పోలింగ్ కొనసాగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. 8 గంటల తర్వాత మా కింగ్ ఎవరో తేలిపోనుంది.