Manchu Vishnu Slams Arshad Warshi: బాలీవుడ్ నటుడు అర్షద్ పై మంచు విష్ణు ఫైర్, ప్రభాస్ జోకర్ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
అర్షద్ పై చర్యలు తీసుకోవాలని సినీ అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాశాడు విష్ణు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని లేఖలో పేర్కొన్నాడు.
Hyd,Aug 23: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. అర్షద్ పై చర్యలు తీసుకోవాలని సినీ అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాశాడు విష్ణు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని లేఖలో పేర్కొన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తూ కల్కి సినిమాలో జోకర్ లాగా కనిపించాడని అన్నారు. కల్కి మూవీ చూశా.. అయితే ఈ మూవీ నాకు నచ్చలేదు...ప్రభాస్ పోషించిన పాత్ర బాగాలేదు. ఆయన పాత్ర ఓ జోకర్‌లా ఉందని చెప్పుకొచ్చారు అర్షద్.
ఇక అమితాబ్ బచ్చన్ మాత్రం అశ్వత్థామగా అదరగొట్టాడు అని చెప్పారు అర్షద్. ఈ వయసులో ఆయన ఇలా నటించడం చాలా గొప్ప విషయం. ఆయనకు ఉన్న శక్తిలో నాకు కొంచెం అయిన ఉండి ఉంటే ఈ పాటికే లైఫ్ సెట్ అయిపోయేది అని ప్రశంసలు గుప్పిస్తూనే ప్రభాస్‌ని కించపరిచేలా చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.
Here's Vishnu Letter: