Guntur Kaaram Poster: మాస్‌ లుక్‌లో మహేష్ బాబు, గుంటూరు కారం నుంచి ఫస్ట్ మాస్‌ లుక్‌ పోస్టర్ విడుదల, సూపర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా హీటెక్కిస్తున్న గుంటూరు కారం

రెండు, మూడు మాస్‌ సినిమాలు చేసిన కామన్‌ ఆడియెన్స్‌ మాత్రం మహేష్‌ను క్లాస్‌ హీరోగానే చూస్తుంటారు. విజిల్స్‌ వేయించే ఫైట్స్‌, ఈలలు వేయించే డైలాగ్స్‌ ఎన్ని చెప్పినా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో క్లాస్‌ అంటే గుర్తొచ్చేది ఆయనే. పైగా ఈ మధ్య మహేష్‌ నుంచి సాలిడ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమానే రాలేద.

Guntur Kaaram Poster(PIC@ Twitter)

Hyderabad, AUG 09: మహేష్ బాబు (Mahesh babu) అంటేనే క్లాస్‌. రెండు, మూడు మాస్‌ సినిమాలు చేసిన కామన్‌ ఆడియెన్స్‌ మాత్రం మహేష్‌ను క్లాస్‌ హీరోగానే చూస్తుంటారు. విజిల్స్‌ వేయించే ఫైట్స్‌, ఈలలు వేయించే డైలాగ్స్‌ ఎన్ని చెప్పినా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో క్లాస్‌ అంటే గుర్తొచ్చేది ఆయనే. పైగా ఈ మధ్య మహేష్‌ నుంచి సాలిడ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమానే రాలేద. అయితే ఈసారి త్రివిక్రమ్‌ గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో మహేష్‌ను ఊరమాస్‌ లెవల్లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అప్పుడెప్పుడో రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నుంచి టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ వరకు అన్ని మాస్‌ అటెన్షన్‌ని క్రియేట్‌ చేసేలాగే కనిపించాయి. పైగా వాటికి జనరల్ ఆడియెన్స్‌ కంటే మాస్‌ ఆడియెన్స్‌ నుంచి ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది.

కాగా తాజాగా మహేష్‌ బర్త్‌డే (Mahesh Babu Birthday) సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి మరో మాస్‌ పోస్టర్‌ను వదిలారు. లుంగీలో కూర్చొని ఓ చేతిలో అగ్గిపెట్ట, మరో చేతితో సిగరెట్‌ను అంటిస్తూ ఉన్న పోస్టర్ మహేష్‌ అభిమానులను మాములు ఎగ్‌జైట్‌ చేయలేదు. ఇలా కదా అభిమానులు మహేష్‌ను చూడాలనుకుంటుంది అనే రేంజ్‌లో పోస్టర్‌ ఉంది. ఓ వైపు పాట గానీ, చిన్న గ్లింప్స్‌ గానీ రిలీజ్‌ చేస్తారని ఆశతో ఉన్న ఫ్యాన్స్‌ను నిరాశపరిచినా.. మరోవైపు మాస్‌ పోస్టర్‌ను వదిలి వాళ్లను కాస్త సాటిస్‌ఫై చేశారు. ఇక చాలా రోజులుగా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? అనే డౌట్‌తో ఉన్న ఫ్యాన్స్‌కు మరోసారి పోస్టర్‌లో డేట్‌ను మెన్షన్‌ చేసి పక్కా చెప్పిన తేదీకే బాబు లాండ్ అవుతాడని క్లారిటీ ఇచ్చేశారు.

Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి వ్యాఖ్యలు, జనసేనకు సపోర్ట్ చేస్తారనే వార్తలకు ఈ కామెంట్లు బలం చేకూరినట్లేనా.. 

ప్రస్తుతం మహేష్‌ విధేశాల్లో ఉన్నాడు. రాగానే ఓ మేజర్‌ షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. ఇక మహేష్‌ వచ్చే లోపు మిగిలన కాస్ట్‌తో కొన్ని మేజర్‌ సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. ఇక ఇటీవలే సినిమాటోగ్రాఫర్‌ తప్పుకోగా.. ఈ సారి ఫైట్‌ మాస్టర్‌లు రామ్‌-లక్ష్మణ్‌లు కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ల ప్లేస్‌లో విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాకు సనిచేసిన తమిళ ఫైట్‌ మాస్టర్‌లు అన్బరీవ్‌లు రీప్లేస్‌ కానున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.



సంబంధిత వార్తలు