Mahesh on Krishna Biopic: నాన్న బయోపిక్‌లో నటించే సాహసం చేయలేను, ఎందుకంటే ఆయన నా దేవుడు, ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే హ్యాపీగా చూస్తానంటున్న మహేష్ బాబు
నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి (Superstar Krishna Biopic Movie) ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్‌లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.
కొన్ని సినిమాలు కొందరే చేయాలి. ‘మేజర్’లో అమరవీరుడు సందీప్‌గా శేష్ బాగా సూటయ్యాడు. సందీప్ పాత్ర నేను చేసుంటే బాగుండేదేమోనని ఆలోచించే అంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి. మిగతా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు హీరో, నిర్మాత మహేశ్‌బాబు. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్లు సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల నటించారు.
అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మహేశ్‌బాబు (Mahesh Babu) మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తీస్తారనే ప్రశ్న ఎదురైంది.
దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘నాన్నగారి (సూపర్‌స్టార్ కృష్ణ) బయోపిక్ (Mahesh on Krishna Biopic) ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి (Superstar Krishna Biopic Movie) ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్‌లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. అలాగే మేజర్ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘బయోపిక్ తీసేటప్పుడు బాధ్యతగా ఉండాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా తీయాలి. ‘మేజర్’ చూశాను. చాలా సీక్వెన్సెస్ గూస్‌బంప్స్ ఇచ్చాయి. చివరి 30 నిమిషాలయితే నా గొంతు ఎండిపోయింది. సినిమా చూశాక రెండు నిమిషాలు మౌనంగా ఉండి, ఆ తర్వాత శేష్‌ను హగ్ చేసుకున్నాను’ అని చెప్పారు.