Adipurush: హనుమంతుడి సీట్లో కూర్చున్నందుకు చితకబాదిన ప్రభాస్ ఫ్యాన్స్, హైదరాబాద్‌లో రచ్చ రచ్చ చేసిన అభిమానులు
‘ఆదిపురుష్’ ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని కొన్ని రోజుల క్రితం ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ థియేటర్‌ల యజమానులకు విజ్ఞప్తి చేశారు.
Hyderabad, June 16: రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజే హైదారాబాద్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడులు జరిగాయి. సినిమా బాగాలేదన్నందుకు ఐమ్యాక్స్ (Imax) థియేటర్లో ఓ వ్యక్తిపైన, హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు భ్రమరాంబ థియేటర్‌లో ఓ వ్యక్తిపైన ప్రభాస్ అభిమానులు దాడులకు పాల్పడ్డారు. ‘ఆదిపురుష్’ ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని కొన్ని రోజుల క్రితం ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ థియేటర్‌ల యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి థియేటర్‌లలో హనుమంతుడి కోసం ఒక్కో సీటును ఖాళీగా విడిచిపెడుతున్నారు. ఆ సీటుపై కాషాయం వస్త్రం కప్పి, సీట్లో పూలు, పండ్లు పెట్టి ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే బ్రమరాంబ థియేటర్‌లో కూడా హనుమంతుడి (Seat For Hanuman) కోసం ఒక సీటును విడిచిపెట్టారు.
అయితే, సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ సీట్లో కూర్చోవడం గొడవకు దారితీసింది. ప్రభాస్ అభిమానులు కొందరు వచ్చి అతడితో గొడవకు దిగారు. అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కార్తీక్ నాగ అనే వ్యక్తి వీడియో తీసిన ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన సందర్భంగా బూతు పదజాలం వినియోగించినందున వీడియోను మ్యూట్ చేసి ట్విటర్‌లో పెట్టారు.