Massive Cutout of Vijay: సినిమా కటౌట్ కాదు, డ్రాయర్ యాడ్‌లా ఉంది! విజయ్ లేటెస్ట్ మూవీ కటౌట్ పై నెటిజన్ల ట్రోల్స్, లైగర్ ట్రైలర్ లాంచ్ కోసం 75 అడుగుల భారీ కటౌట్
ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ఏకంగా ట్రెండ్ ను (Trend) సెట్ చేస్తాడు. అర్జున్ రెడ్డితో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న విజయ్ కి...మాస్ లో భారీగా ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన కొత్త మూవీ లైగర్ కోసం ఫ్యాన్స్ చాలా (arjun reddy) వెయిట్ చేస్తున్నారు.
Hyderabad, July 21: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (vijay devarakonda) ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ఏకంగా ట్రెండ్ ను (Trend) సెట్ చేస్తాడు. అర్జున్ రెడ్డితో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న విజయ్ కి...మాస్ లో భారీగా ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన కొత్త మూవీ లైగర్ కోసం ఫ్యాన్స్ చాలా (arjun reddy) వెయిట్ చేస్తున్నారు. లైగర్(Liger) మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ప్రొడ్యసర్స్. ఆ మూవీ ట్రైలర్ లాంచ్ (Liger trailer launch event) కోసం ఏకంగా సుదర్శన్ థియేటర్ (Sudarshan theater) వద్ద భారీ కటౌట్ ను (cut out) పెట్టారు. 75 అడుగుల విజయ్ కటౌట్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.
బాక్సింగ్ క్రీడాకారుడిగా కనిపిస్తున్న విజయ్...6 ప్యాక్ తో కేవలం డ్రాయర్ మీద ఫోజ్ ఇచ్చాడు. అంతేకాదు జాతీయ జెండాను తన భుజాల మీద మోస్తూ కటౌట్ లో కనిపించాడు. ఈ కటౌట్ చూసిన ఫ్యాన్స్ ఊర్రూతలూగుతున్నారు. అయితే అదేరేంజ్ లో ట్రోలింగ్ (Trolling) కూడా మొదలైంది.
ఇది విజయ్ సినిమా పోస్టర్ లా లేదు. కట్ డ్రాయర్ యాడ్ లా ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు విజయ్ పోస్టర్ ను వివిధ రకాలుగా మార్పింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
ట్రోలింగ్ పై విజయ్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. అయితే ఫన్నీగా చేసిన మీమ్స్ విజయ్ మూవీకి ఫుల్ ప్రచారం తీసుకువచ్చాయి. విజయ్ దేవర కొండ తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది 'లైగర్'. ఈ మూవీకి టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri jagannath) దర్శకత్వం వహించారు. విజయ్‌కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే (ananya pande) నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Koffee With Karan: సమంతతో అక్షయ్ కుమార్ డ్యాన్స్ వీడియో వైరల్, కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్ లో సందడి
ఈ మూవీ ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక 'లైగర్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్‌ఎమ్ థియేటర్‌లో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.