అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన సంగతి విదితమే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ సహా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలోని పాటలు ఏ స్థాయిలో పాప్యులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో, బాక్సాఫీస్ విజయంతోనే ఈ సినిమా చరిత్ర ఆగిపోలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలోని మ్యాజిక్ ఆల్బమ్ కొత్త రికార్డు సాధించింది.
దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్ బిడ్డా పాటలు అభిమానులను ఉర్రూతలగించాయి. దాంతో, ఈ సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్ ను దక్కించుకున్నాయి. భారత దేశంలో మరే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు ఈ స్థాయి వ్యూస్ రాలేదు. దాంతో, పుష్ప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలోనే ‘పుష్ప 2’ సెట్స్ మీదకు వెళ్లనుంది.
The Biggest Ever Feat In Indian Cinema ❤️🔥
Icon Star @alluarjun's #PushpaTheRise is the First Album to hit 5 BILLION VIEWS 🔥🔥
A Rockstar @ThisIsDSP Musical🎧#5BViewsForPushpaAlbum 🔥@iamRashmika @aryasukku @TSeries @adityamusic pic.twitter.com/mR3G9PwYtS
— Mythri Movie Makers (@MythriOfficial) July 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)