Chiru Satire: మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం! గరికపాటిపై తాజాగా చిరంజీవి పరోక్షంగా సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్

దాంతో చిరంజీవి స్పందిస్తూ "ఇక్కడ వారు (గరికపాటి) లేరు కదా!" అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు.

Credits: Twitter

Hyderabad, October 30: ఇటీవల హైదరాబాదులో (Hyderabad) నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరవడం, ఆయన ఫ్యాన్స్ (Fans)తో ఫొటోలు దిగడం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు (Garikapati Narasimharao) కోపం తెప్పించడం తెలిసిందే. ఈ ఘటన ఓ వివాదం రూపుదాల్చింది. గరికపాటి క్షమాపణలు చెప్పినట్టు వార్తలు రాగా, చిరంజీవి కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పిలుపునివ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేశ్.. కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలతో బిజీ అని వివరణ

అయితే, నిన్న చిరంజీవి ఓ ఈవెంట్ కు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు చిరంజీవితో ఫొటోల కోసం పోటీలు పడ్డారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు. అనంతరం, వారు "లేరు" అని చెప్పడంతో, చిరంజీవి ఛాతీపై చేయి వేసుకుని "హమ్మయ్య" అంటూ రిలీఫ్ గా ఫీలవుతున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. "ఇక రండమ్మా" అంటూ అక్కడున్న మహిళలను ఫొటోలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఈ వ్యాఖ్య గరికపాటిని ఉద్దేశించే చేసి ఉంటారని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు