Bandla Ganesh (Credits: Twitter)

Hyderabad, October 30: టాలీవుడ్ (Tollywood) నిర్మాత (Producer), నటుడు (Actor) బండ్ల గణేశ్ (Bandla Ganesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల (Politics) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్, వ్యాపార పనుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బండ్ల గణేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం కానీ, మిత్రత్వం కానీ లేవని స్పష్టం చేశారు. తనకు అందరూ ఆత్మీయులేనని, అందరినీ సమానంగా చూస్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరైనా తన వల్ల ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బాధపడి ఉంటే తనను పెద్ద మనసుతో క్షమించాలని బండ్ల గణేశ్ విజ్ఞప్తి చేశారు.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ నేడే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు కోసం పాక్ అభిమానుల ప్రార్థనలు.. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై భారత్ గెలిస్తే పాక్‌కు సెమీస్ అవకాశాలు.. నేడు నెదర్లాండ్స్‌ తో జరిగే మ్యాచ్ లో పాక్ ఓడితే ఇంటికే

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం చవిచూడగా, ఆ తర్వాత బండ్ల గణేశ్ పెద్దగా రాజకీయాల్లో పాల్గొన్నదిలేదు.