Mumbai Shocker: డ్రగ్‌ కేసు అంటూ ఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల బెదిరింపులు, నటి ఆత్మహత్య, నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

ఈ విషాద ఘటన ముంబైలో (Mumbai Shocker) చోటు చేసుకుంది. డ్రగ్‌ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు (Actor Commits Suicide) పాల్పడినట్లు తెలుస్తోంది.

Representational Image (Photo Credits: File Image)

ఫేక్‌ ఎన్‌సీబీ అధికారుల రైడింగ్‌తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ముంబైలో (Mumbai Shocker) చోటు చేసుకుంది. డ్రగ్‌ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు (Actor Commits Suicide) పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డిసెంబర్‌ 20న నటి స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ నటిని ఎన్‌సీబీ అధికారులమంటూ రైడ్‌ చేశారు. కేసు పెట్టకూడదంటే 40 లక్షల రూపాయలివ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తామని బెదిరించారు.

దీంతో ఆ యువ నటి అతికష్టం మీద రూ.20 లక్షలు సర్దగలిగింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. ఈ వ్యవహారంతో కలత చెందిన నటి డిసెంబర్‌ 23న తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది.

సల్మాన్‌ ఖాన్‌‌ని మూడు సార్లు కాటేసిన పాము, ఘటనపై మీడియాతో మాట్లాడిన సల్లూ భాయ్

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రైడ్‌ జరిపింది ఫేక్‌ ఎన్‌సీబీ అధికారులని గుర్తించారు. నిందితులు సూరజ్‌ పర్దేశి, ప్రవీణ్‌ వాలింబేను అరెస్ట్‌ చేశారు.