బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డే నేడు(డిసెంబర్‌ 27). దుదరృష్టవశాత్తూ బర్త్‌డేకు ఒకరోజుముందు సల్మాన్‌ పాముకాటుకు గురయిన విషయం విదితమే. వెంటనే అతడికి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి సల్మాన్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఒక పాము నా ఫామ్‌హౌస్‌లోకి వచ్చింది. ఒక కట్టెతో దాన్ని అవతలకు పారేయాలనుకున్నా. కానీ అది వెంటనే నా చేతిపైకి పాకింది. దాన్ని కిందపడేసేలోపే మూడుసార్లు నన్ను కాటేసింది. అది ఒకరకమైన విషపూరిత పాము అనిపించింది. ఆసుపత్రిలో ఆరు గంటలు ఉన్న తర్వాత నన్ను డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)