Naga Chaitanya On Divorce: ఇప్పటికైనా వదిలేయండి! సమంత చాలా మంచి అమ్మాయి, మాకు వర్కవుట్ అవ్వలేదంటే ఎందుకు వినరు! విడాకులపై ఘాటుగా స్పందించిన నాగచైతన్య
ఇప్పటివరకు ఇద్దరు ఎక్కువగా ఓపెన్ అవ్వలేదు. సమంత మాత్రం ఎవరైనా రాసే వార్తలకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తుంది. చైతూ అయితే ఇప్పటివరకు అస్సలు దాని గురించి కూడా మాట్లాడలేదు.
Hyderabad, May 10: నాగచైతన్య, కృతి శెట్టి (Krithi Shetty) జంటగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కస్టడీ(Custody). ఇందులో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు. కస్టడీ సినిమా మే 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక చైతన్య, సమంత విడాకుల తీసుకున్న తర్వాత మీడియా ముందుకు వస్తే దాని గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు ఎక్కువగా ఓపెన్ అవ్వలేదు. సమంత మాత్రం ఎవరైనా రాసే వార్తలకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తుంది. చైతూ అయితే ఇప్పటివరకు అస్సలు దాని గురించి కూడా మాట్లాడలేదు. తాజాగా కస్టడీ ప్రమోషన్స్ లో కూడా అవే ప్రశ్నలు ఎదురవడంతో.. ఒకటి రెండు సార్లు సమంత మంచి అమ్మాయి, మా ఇద్దరికీ గొడవలు అయ్యాయి, వర్కౌట్ అవ్వలేదు అందుకు విడిపోయాము అని సింపుల్ గా మాట్లాడాడు చైతూ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి కూడా అదే చెప్పినా, విడాకుల తర్వాత వచ్చిన గాసిప్స్ , రూమర్స్, వార్తలపై సీరియస్ గా స్పందించాడు.
నాగచైతన్య మాట్లాడుతూ.. నా సినిమాల గురించి ఎంత మాట్లాడినా ఓకే, ఎన్ని కౌంటర్లు వేసినా ఓకే. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది. మా మ్యారేజ్ లైఫ్ మీద నాకు గౌరవం ఉంది. కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాము. విడిపోయే ముందు ఇద్దరం ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. కానీ ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే బాధగా అంది. కోర్టు అధికారికంగా విడాకులు ఇచ్చి కూడా సంవత్సరం అయిపోయింది. అయినా ఇంకా అదే విషయాన్ని సాగదీస్తున్నారు.
మా ఇద్దరితో పాటు వేరే వ్యక్తులని ఇందులోకి లాగి ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. మా కుటుంబాలు ఎంత బాధపడతాయి అని ఆలోచించట్లేదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అందరూ వదిలేస్తారని భావిస్తున్నాను అని అన్నాడు. దీంతో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో సమంత హార్డ్ వర్కర్ అని, తాను అనుకుంటే దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తుందని చెప్పాడు.