Rashmika Mandanna AI Deepfake Video: ఇంత దారుణంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారా, రష్మిక డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలని సూచన
బ్రిటీష్ ఇండియా సోషల్ మీడియా పర్సనాలిటి జారా పటేల్(Zara Patel) వీడియోకి రష్మిక ముఖాన్ని ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిటీష్ ఇండియా సోషల్ మీడియా పర్సనాలిటి జారా పటేల్(Zara Patel) వీడియోకి రష్మిక ముఖాన్ని ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై రష్మిక అభిమానులే కాకుండా ప్రముఖ స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ , ఎమ్మేల్సీ కల్వకుంట్ల కవిత ఇంకా పలువురు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డీప్ ఫేక్ వీడియోపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య స్పందించారు. అతనితో పాటు గాయని చిన్మయి శ్రీపాద కూడా స్పదించింది.
ఈ దారుణంపై చైతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి' అంటూ అంతకుముందు రష్మిక చేసిన ట్వీట్‌కు ఆయన ట్యాగ్ చేశారు.
డీప్ ఫేక్ వీడియో, కన్నీటి పర్యంతమైన నటి రష్మిక మందన్న, ఈ వీడియోపై ఎవరెవరు ఏమన్నారంటే...
తన మద్దతుగా నిలిచిన చైతూకి రష్మిక కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల వల్ల సమాజంలో ఎంతోమంది అమ్మాయిలు ఇబ్బందులకు గురవుతున్నారని.. ఇది చాలా భయానకమైన చర్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు సపోర్టుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజజ్ఞతలు తెలియజేసింది.
నిన్న ఈ ఘటనపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే.టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తుంటే నిజంగా ఎంతో నిరుత్సాహం కలిగిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని తెలిపారు.
కొందరు దుండగులు రష్మిక ముఖాన్ని మరో యువతి వీడియోగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై చాలా మంది మండిపడుతున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.