Naga Shaurya Wedding: ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో, బెంగళూరులో ఘనంగా నాగశౌర్య వెడ్డింగ్, ఇంతకీ నాగశౌర్య భార్య ఏం చేస్తుంటుందో తెలుసా?

కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని (Anusha Shettey) వివాహం చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇరుకుంటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు పాల్గొన్నారు.

naga-shaurya-gets-married Credit @ Anushka Shetty Instagram

Bengalore, NOV 20: టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య (Naga Shourya) ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని (Anusha Shettey) వివాహం చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇరుకుంటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు పాల్గొన్నారు. హీరో నారా రోహిత్‌ వీరి పెళ్ళికి హాజరై సందడి చేశాడు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా సోమవారం హల్దీ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకున్న నాగశౌర్య.. అదే రాత్రి కాక్ టైల్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో నాగశౌర్య, అనూష శెట్టికి రింగ్‌ తొడిగాడు. ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

నాగశౌర్య, అనూష శెట్టిలది లవ్‌ కమ్‌ అరేంజ్ మ్యారేజ్‌. అనూష శెట్టికి బెంగళూర్‌లో సొంతంగా ఆఫీస్‌ ఉంది. ఈమె ఇంటీరియర్‌ డిజైనర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తుంది. అనూష తన రంగంలో ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

Chargesheet On Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై చార్జి షీట్.. పోర్నోగ్రఫీ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు ముందడుగు

ఇక నాగశౌర్య ఇటీవలే ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌ రోజు నుండి పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఫైనల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు సినిమాలున్నాయి.