Chargesheet On Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై చార్జి షీట్.. పోర్నోగ్రఫీ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు ముందడుగు
Credits: Instagram

Hyderabad, Nov 20: వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా (Raj Kundra) పోర్నోగ్రఫీ (Pornography) కేసుకు సంబంధించి మహారాష్ట్ర సైబర్ సెల్ (Maharastra CyberCell) పోలీసులు తాజాగా చార్జి షీట్ (ChargeSheet) నమోదు చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ లో  అశ్లీల దృశ్యాలు ఉచిత్రీకరించినట్టు అందులో పేర్కొన్నారు. వీడియోల్లోని మోడల్స్ తో పాటు రాజ్‌కుంద్రాపై ఈ చార్జ్ షీట్ నమోదు చేశారు. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ (HotShots) అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గతంలో పేర్కొన్నారు. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు.

సాకర్ ప్రియులను ఉర్రూతలూగించే ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధం.. నేటి నుంచి డిసెంబరు 18 వరకు పోటీలు.. ఖతార్ వేదికగా ఫుట్ బాల్ ప్రపంచకప్.. మొత్తం 32 జట్లతో సాకర్ సంరంభం.. తొలి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ

దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని రాజ్‌కుంద్రా కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇప్పటికే రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్, షెర్లిన్ చోప్రా తదితరులను విచారించిన సంగతి తెలిసిందే.