Neru OTT Streaming: డిస్నీ+హాట్‌స్టార్‌ లోకి వచ్చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ నెరు, అత్యాచారానికి గురైన అంధురాలికి న్యాయం కోసం జరిగే పోరాటమే సినిమా

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నెరు’ (Neru) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం తాజాగా నేటి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) వేదికగా అందుబాటులోకి వచ్చింది.

Neru OTT Streaming Date and Time

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నెరు’ (Neru) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం తాజాగా నేటి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) వేదికగా అందుబాటులోకి వచ్చింది.థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ఓపెన్‌హైమర్‌, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచిన బార్బీ సినిమా, నామినేషన్స్‌ జాబితా ఇదిగో..

నేరు సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. గతంలో మోహన్ లాల్‍తో జీతూ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని ఇతర భాషల్లోకి కూాడా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ మళ్లీ ‘నేరు’తో బ్లాక్‌బాస్టర్ సాధించారు. ఈ చిత్రానికి జీసెఫ్‍తో పాటు శాంతి మాధవి రచయితగా వ్యవహరించారు.నేరు చిత్రంలో అనాశ్వర రాజన్, ప్రియమణి, శాంతి మహదేవి, సిద్ధిఖీ, జగదీశ్, కేబీ గణేశ్ కుమార్, శంకర్, మాథ్యూ వర్గీస్, హరిత నాయర్ కీలకపాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. విష్ణు శ్యాం సంగీతం అందించారు.

Here's News

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar Malayalam (@disneyplushotstarmalayalam)

సారా (అనాశ్వర రాజన్) అనే అంధురాలైన అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. మైకేల్ (శంకర్) అనే యువకుడు ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ తర్వాత ఓ క్లూతో పోలీసులు శంకర్‌ను అరెస్ట్ చేస్తారు. మైకేల్ తండ్రి ఓ పెద్ద బిజినెస్‍మెన్ కావటంతో తన కొడుకును విడిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది రాజశేఖర్ (సిద్ధిఖీ)ని కేసు వాదించేందుకు తీసుకొస్తాడు. రాజశేఖర్ రావటంతో బాధితురాలైన సారా తరఫున వాదించేందుకు ఇతర లాయర్లు వెనుకంజ వేస్తారు. ఆ సమయంలో గతంలో సస్పెండ్ అయిన లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్) మళ్లీ నల్లకోటు వేసుకొని.. సారా తరఫున వాదించేందుకు సిద్ధమవుతారు. నేరు చిత్రం మొత్తం కోర్టు రూమ్ డ్రామాగానే ఉంటుంది. న్యాయవాదుల మధ్య వాదనలు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.