Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో విషాదం, 37 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మృతి చెందిన కమెడియన్, దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ
ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Thiruvananthapuram, AUG 23: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన వయసు 37 సంవత్సరాలు. ఈ విషయాన్ని నిర్మాత సంజయ్ పడియూర్ ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో బరువెక్కిన హృదయంతో సంజయ్ స్పెషల్ నోట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘నా ప్రియస్నేహితుడికి వీడ్కోలు. ఆమెన్ మూవీలో కీలక పాత్ర పోషించిన ఈ నటుడు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో (Nirmal Benny Died) మరణించాడు. అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’ అని రాసుకొచ్చారు.
యూట్యూబ్ వీడియోలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు నిర్మల్ బెన్నీ. సినీ రంగంలో హాస్యనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2012లో ‘నవగాథార్కు స్వాగతం’ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో బెన్నీ ఐదు చిత్రాలలో నటించాడు, ఇందులో ఆమెన్ చిత్రం అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.