Nithiin-Shalini Wedding: పెళ్లికి రావాలని తెలంగాణ సీఎంని ఆహ్వానించిన యంగ్ హీరో నితిన్, ఈ నెల 26న హైదరాబాద్‌లో షాలినితో నితిన్ వివాహం, కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్‌ కోరారు. నితిన్‌తోపాటు ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు.

Nithiin invites Telangana CM K Chandrashekar Rao for his wedding (Photo Credits: Instagram)

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ ‌హీరో నితిన్‌ తన వివాహ వేడుకకు (Nithiin Wedding) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం (Nithiin Invites Telangana CM K Chandrashekar Rao) పలికారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్‌ కోరారు. నితిన్‌తోపాటు ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు. దయా హృద‌యంతో నీవు చేసే పనులు ఎప్పటికీ వృధాకావు, శ్రీమతికి చెర్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు, పూల హరివిల్లు మధ్యన ఉపాసన

కాగా, ఈనెల 26న తన ప్రేయసి షాలినితో నితిన్ వివాహం (Nithiin-Shalini Wedding) జగరనుంది. ఫిబ్రవరి15న నితిన్ షాలినిల నిశ్చితార్థం చేసుకోగా ఇక ఏప్రిల్ 16న మోగాల్సిన పెళ్లి బాజాలు కరోనా లాక్‌డౌన్ ‌కారణంగా వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత సన్నిహితులు సమక్షంలో తన ప్రేయసి మెడలో నితిన్‌ మూడుముళ్లు వేయనున్నారు .

ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో పెళ్లి వేడుక జరుగనుంది. ఆ రోజు రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌తో పాటు మరికొంత మంది సన్నిహిత మిత్రులను నితిన్ ఆహ్వానించాడు.



సంబంధిత వార్తలు

Pushpa Re-Release: కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిలాప‌డ్డ‌ పుష్ప‌, హిందీ వ‌ర్ష‌న్ మూవీ రిలీజ్ విష‌యంలో అల్లు అర్జున్ కు ఎదురుదెబ్బ‌

All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్