NTR 30 Muhurat Ceremony: జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ మహుర్తం పూజ పూర్తి, ఏడాది తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టిన ఎన్టీఆర్, చీరకట్టులో తళుక్కుమన్న జాన్వీకపూర్
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు ప్రకటించినా అవి మొదలవ్వలేదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. NTR 30 సినిమా దర్శకుడు కొరటాల శివతో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మహుర్తం పూజ ఇవాళ జరిగింది.
Hyderabad, March 23: జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ (NTR 30) మూవీకోసం గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు ప్రకటించినా అవి మొదలవ్వలేదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. NTR 30 సినిమా దర్శకుడు కొరటాల శివతో (Koratala shiva) ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ (Kalyan ram) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మహుర్తం పూజ ఇవాళ జరిగింది. ఎన్టీఆర్ 30 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మంచి అప్‌డేట్ ఇచ్చింది టీం. అయితే ఎన్టీఆర్ 30 (NTR 30) ఒకసారి పూజా కార్యక్రమం అనుకున్నా అది తారకరత్న మృతితో వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆస్కార్ కోసం వెళ్లి రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం మార్చ్ 23న జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.
ఎన్నడూ, ఏ సినిమాకి లేని విధంగా భారీగా డెకరేట్ చేసి వెనకాల స్క్రీన్స్ పెట్టి అందులో ఎన్టీఆర్ (NTR), హరికృష్ణ ఫోటోలు వచ్చేలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ వచ్చి పూజలు నిర్వహించారు. రాజమౌళి(SS Rajamouli), ప్రశాంత్ నీల్ (Prashant Neel), ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దిల్ రాజు, సితార, మైత్రి సంస్థల నిర్మాతలు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు విచ్చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుందని ఇటీవలే కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
పూజా కార్యక్రమానికి జాన్వీ కూడా పద్దతిగా చీరలో విచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశాడు. NTR 30 పూజా కార్యక్రమానికి వచ్చిన అందరూ కొబ్బరికాయ కొట్టి, దేవుడికి దండం పెట్టుకున్నారు. రాజమౌళితో ఎన్టీఆర్, జాన్వీ సరదాగా ముచ్చట్లు పెట్టారు. ఎన్టీఆర్ అందరిని ఆప్యాయంగా పలకరించారు. అలాగే సినిమా పూజా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో NTR 30 ట్రెండింగ్ లో ఉంది. త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. షూటింగ్ మొదలవ్వకముందు నుంచే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.