Pawan Kalyan Fans Fire On Thaman: ఇదేంటి తమన్ భయ్యా ఇలా చేసేశావ్? అఖండకు అదిరిపోయేట్టు కొట్టావ్, భీమ్లా నాయక్ ట్రైలర్ చెడగొట్టావ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం..
అయితే ఇందులో తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మరో లెవెల్ ట్రోలింగ్ నడుస్తుంది.
భీమ్లా నాయక్ ట్రైలర్ అంచనాలని అందుకోలేపోయిందంటూ నెటిజన్స్, ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇందులో తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మరో లెవెల్ ట్రోలింగ్ నడుస్తుంది. పాటలు పర్వాలేదనుకున్నా.. ట్రైలర్‌ను చూసి మాత్రం అభిమానులు పెదవి విరిచారు. ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో నటిస్తున్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కనిపించారు. వారితో పాటు మురళీ శర్మ, రావు రమేష్ కూడా ఉన్నారు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా లేదని అంటున్నారు.
ఇదేంటి తమన్ భయ్యా ఇలా చేసేశావ్? అఖండకు అదిరిపోయేట్టు కొట్టావ్ కదా? అని కామెంట్లు పెడుతున్నారు. ఇక తమన్ మీద జరుగుతున్న ట్రోలింగ్ మాత్రం వీర లెవెల్‌లో ఉంది. దీంతో తమన్ పరోక్షంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తమన్ వేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. థియేటర్లో ర్యాంప్ అమ్మా.. అన్నీ ట్రైలర్లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా.. అడవిలోని మంటకు.. వీధుల్లో వచ్చే మంటకు తేడా ఉండాలి కదా?.. కలుద్దాం అంటూ తమన్ ఓ ట్వీట్ వేసి అసలు విషయాన్ని చెప్పేశాడు.