Pawan Kalyan Home Quarantine: కరోనా టెన్సన్..హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్, జనసేన అధినేత వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్, తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లపై నెలకొన్న సందిగ్ధ‌త

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Janasena Chief Pawan Kalyan | File Photo

Amaravati, April 11: జన‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం క్వారంటైన్‌లోకి (Pawan Kalyan Home Quarantine) వెళ్లారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

త్వ‌ర‌లోనే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ స్థానంలో పోటీకి బీజేపీ-జ‌న‌సేన త‌ర‌ఫున అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ పోటీ చేస్తున్నారు. ఎన్నికముందే ప‌వ‌న్ క‌ల్యాణ్ సిబ్బందిలో కొంద‌రు క‌రోనా బారిన ప‌డ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లపై సందిగ్ధ‌త నెల‌కొంది. ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని నెగ‌టివ్ అని తేలితే మ‌ళ్లీ ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొనే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే తిరుపతి ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Addanki MLA Gottipati Ravi), మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar), టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా (TDP MLAs and former MLAs tests positive for covid 19) తేలింది.

వైయస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేనని తెలిపిన ఏపీ సీఎం, తిరుపతి ప్రజలకు బహిరంగ లేఖ

దీంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్‌ (Hyderabad) బయలుదేరారు. చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం (AP CM YS Jagan) పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు.

చంద్రబాబుకు కరోనా టెన్సన్, టీడీపీ అధినేతను కలిసిన అనిత, సంధ్యారాణి‌లకు కరోనా పాజిటివ్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్‌లకు కోవిడ్ నిర్థారణ, టీడీపీ ప్రచారంలో కలకలం రేపుతున్న కరోనా

తిరుపతి సభకు (tirupati-election-campaign) నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశానని తెలిపారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం