Tirupati, April 10: టీడీపీ తిరుపతి ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Addanki MLA Gottipati Ravi), మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar), టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా (TDP MLAs and former MLAs tests positive for covid 19) తేలింది.
దీంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ (Hyderabad) బయలుదేరారు. చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కరోనా టెన్షన్ వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన వంగలపూడి అనిత, ఎమ్మెల్స సంధ్యారాణిలు గురువారం చంద్రబాబుతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణి లకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాజిటివ్ తేలిన నేతలతో కాంటాక్ట్ ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
గత 24 గంటల్లో కొత్తగా 2,765 పాజిటివ్ కేసులు నమోదవగా.. 11 మంది కరోనాతో చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 9,18,597కి, మరణాలు 7,279కి ఎగబాకాయి. చిత్తూరు, గుంటూరుజిల్లాలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరులో 496, గుంటూరులో 490 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఆ తర్వాత కృష్ణాలో 341, విశాఖలో 335, నెల్లూరులో 292, కడపలో171, అనంతపురంలో 167, ప్రకాశంలో 161, శ్రీకాకుళంలో 100 కేసులు నమోదయ్యాయి. కర్నూలు (79), తూర్పుగోదావరి (78), విజయనగరం (49), పశ్చిమగోదావరి (6)లో మాత్రం పరిస్థితి కాస్త అదుపులో ఉన్నట్టు కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి పెరగడంతో యాక్టివ్ కేసులు కూడా పైపైకి పోతున్నాయి. తాజాగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, గుంటూరు, కృష్ణా, ప్రకాశంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులకు కరోనా సోకినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. ఆలయంలో పనిచేస్తున్న సుమారు 12 మంది అర్చకులకు పాజిటివ్ వచ్చిందని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపఏపీఐఐసీ అతి!రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.