దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరోనావైరస్ నుంచి అందరూ తమను తాము కాపాడుకోవాలని గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా చెబుతోంది. మాస్క్ వాడండి.ప్రాణం కాపాడండి, ముఖం కవర్ చేయండి, చేతులు కడుక్కోండి, దూరం పాటించండి అంటూ అవగాహనా కార్యక్రమాలను గూగుల్ డూడుల్ (Covid Google Doodle) ద్వారా తెలియపరుస్తోంది.
వాస్తవాలు తెలుసుకోవడం మరియు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉండేవారిని సంరక్షించండి. మీ స్థానిక ఆరోగ్య సంస్థ తెలియజేసిన సలహాని పాటించండి.మాస్కు ధరించిన వ్యక్తి నుండి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు సహాయపడతాయి. మాస్కులు మాత్రమే కోవిడ్-19 నుండి రక్షించలేవు, భౌతిక దూరాన్ని మరియు చేతిని శుభ్రంగా చేసుకోవడం కూడా అవసరం. మీ స్థానిక ఆరోగ్య అధికారి అందించిన సలహాని పాటించండి. తగు జాగ్రత్తలు తీసుకోండి అంటూ అందరినీ అప్రమత్తం చేస్తోంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి:
మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి. సబ్బు మరియు నీటిని లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్‌ని ఉపయోగించండి.
దగ్గుతున్న లేదా తుమ్ముతున్న వారి నుండి సురక్షిత దూరాన్ని పాటించండి.
భౌతిక దూరాన్ని పాటించలేనప్పుడు మాస్కుని ధరించండి.
మీ కళ్లు, ముక్కు లేదా నోటిని తాకవద్దు.
మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముక్కు మరియు నోటిని మీ వంచిన మోచేయి లేదా టిష్యూతో అడ్డుపెట్టుకోండి.
ఒకవేళ ఒంట్లో బాగోనట్లయితే ఇంటిలో ఉండండి.
మీరు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే, వైద్య సాయం పొందండి.
ముందుగా కాల్ చేయడం వల్ల మిమ్మల్ని సరైన ఆరోగ్య సదుపాయానికి పంపడంలో మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది మరియు వైరస్‌లు, ఇతర అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది.
ఎలా సోకుతుంది
కొరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) అనేది ఒక అంటువ్యాధి.కోవిడ్-19 కలిగిన వైరస్ ప్రధానంగా వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా గాలి బయటకు విడిచిపెట్టినప్పుడు వెలువడే గాలి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లు గాలిలో ఉండవచ్చు మరియు నేలపై లేదా ఉపరితలాలపై వేగంగా పడిపోవచ్చు. కోవిడ్-19 సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండి వైరస్‌ని శ్వాసించినా లేదా కలుషితమైన ఉపరితలాలను తాకి, తరువాత మీ కళ్లు, ముక్కు లేదా నోటిని తాకినప్పుడు మీకు అంటువ్యాధి సోకవచ్చు.