Pawan Kalyan New Film: క్రేజీ కాంబినేషన్‌లో పవర్ స్టార్ కొత్త మూవీ, మూవీ పోస్టర్‌లో ఆసక్తికర అంశాలు, గ్యాంగ్‌స్టర్‌గా వస్తున్న పవన్‌ కల్యాణ్

అతన్ని #OG అని పిలుస్తారు అని చూపించారు. అలాగే పోస్టర్ పై జపాన్‌ భాషలో ఏదో కోడ్ ఉంది, దీంతో సినిమా సాహో లాగే వేరే దేశాల్లో భారీగా ఉండొచ్చు అని తెలుస్తుంది.

Pawan Kalyan Sujeeth Combo (Image Credit @ DVV Twitter)

Hyderabad, DEC04: ఇటీవల డైరెక్టర్స్, హీరోస్ ఎవ్వరూ ఊహించని కొత్త కొత్త కాంబినేషన్స్ (Crazy Combinations) వస్తున్నాయి. తాజాగా మరో సూపర్ క్రేజీ కాంబో అనౌన్సమెంట్ వచ్చింది. RRR నిర్మాత డివివి దానయ్య (DVV Danaiah) నిర్మాణంలో ప్రభాస్ తో సాహో (Sahoo) లాంటి హాలీవుడ్ మేకింగ్ సినిమా తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో (Sujith) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సినిమాని అధికారికంగా నేడు ప్రకటించారు. ఈ కాంబినేషన్ తో అందరూ ఆశ్చర్యపోయారు. అస్సలు ఎవ్వరూ ఊహించని, కనీసం గాసిప్స్ కూడా వినపడని కాంబినేషన్‌ ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న ఫొటోని రెడ్ షేడ్స్ పోస్టర్ పై పెట్టి.. అతన్ని #OG అని పిలుస్తారు అని చూపించారు. అలాగే పోస్టర్ పై జపాన్‌ భాషలో ఏదో కోడ్ ఉంది, దీంతో సినిమా సాహో లాగే వేరే దేశాల్లో భారీగా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక #OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. మొదటి సారి పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ (Gangstar) సినిమా చేయబోతున్నారు. ఇక సుజీత్ మేకింగ్ గురించి కూడా తెలిసిందే. దీంతో సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. క్రిష్, హరీష్ శంకర్ (Harish Shankar), సురేందర్ రెడ్డి, సముద్ర ఖని దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి. ఉన్న సినిమాలు పూర్తి చేయడానికే టైం చాలట్లేదు. హరిహర వీరమల్లు సినిమాని రెండేళ్లుగా తెరకెక్కిస్తున్నారు. అటు పాలిటిక్స్, ఇటు సినిమాలకి టైం అడ్జస్ట్ చేయలేకపోతున్నారు పవన్. దీంతో సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. ఉన్న సినిమాలు చేయడానికే టైం లేదు అంటే ఇప్పుడు ఇంకో కొత్త సినిమా అది కూడా భారీ బడ్జెట్ గ్యాంగ్‌స్టర్ సినిమా కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Chaitanya With Sobhita: హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య.. డేటింగ్ ప్రచారానికి మరింత బలం చేకూరిన వైనం.. వైరల్ అవుతున్న ఫొటో! 

మరో సంవత్సరంలో ఎలక్షన్స్ రానున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాలకి అస్సలు టైం ఇవ్వలేడు పవన్. అలాంటిది ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో భారీ సినిమాని అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలుపెడతారావు, ఎప్పుడు పూర్తి చేస్తారో అని అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి బయటకి వస్తుందో. అయితే ఈ కాంబినేషన్ పై పవన్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.