Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు
తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Hyderabad, Dec 10: మంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహన్ బాబు (Mohan Babu), మనోజ్ (Manoj) ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. అలాగే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు అతని భార్య భూమా మౌనికపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అసలేమిటీ వివాదం?
మంచు మనోజ్ తన భార్యా పిల్లలతో ఇంట్లో ఉండగా, పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, నాలుగు నెలల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్... మళ్లీ తన ఇంటికి వచ్చి, కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి అలజడి సృష్టిస్తున్నాడని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.