Tarak Ponnappa as Bugga Reddy in Pushpa 2, Krunal Pandya (Photo Credits: Instagram)

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించి ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులు స్థాపించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ భాషలో విడుదలైన ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లోనూ చక్కటి కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు అభిమానులు థియేటర్లలో కేరింతలు కొడుతున్నారు. అయితే ఈ చిత్రంలో ఇతర నటీనటులు సైతం అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఫాహద్ పాజిల్, హీరోయిన్ పాత్రలో రష్మిక మందాన, ఇతర ముఖ్య పాత్రలో రావు రమేష్, సునీల్, అనసూయ, అజయ్, బ్రహ్మాజీ వంటి నటులు చక్కటి పర్ఫామెన్స్ కనబరిచారు.

 

View this post on Instagram

 

A post shared by Tarak Ponnappa (@tarakponnappa)

అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన విలన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాడు. అందుకు ఒక కారణం ఉంది ఆ విలన్ చూసేందుకు అచ్చం ప్రముఖ క్రికెటర్ కృనాల్ పాండ్యా లాగా ఉండటమే విశేషం. నెటిజల్లు ఏకంగా ఈ చిత్రంలో క్రునాల్ పాండ్యా విలన్ గా నటించాడని అతని నటన చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం పెడుతున్నారు. దీంతో చిత్ర యూనిట్ సైతం అవాక్కు అవుతోంది. నిజానికి ఈ చిత్రంలో రుణాలు పాండ్యకు ఎలాంటి రోల్ లేదు. ఈ సినిమాలో చిత్రం క్లైమాక్స్ ఫైటింగ్ లో కనిపించే విలన్ పేరు తారక్ పొన్నప్ప.

పుష్ప చిత్రంలో అన్న కుమార్తెను కిడ్నాప్ చేసిన విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప కనబరిచిన నటన థియేటర్లలో అందరినీ ఆకట్టుకుంది అయితే అతను చూసేందుకు అచ్చం క్రికెటర్ కృనాల్ పాండ్యా తరహాలో ఉండటంతో అందరూ ఈ సినిమాలో కృనాల్ నటించాడని భావిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టడంతో ప్రతి ఒక్కరిలోనూ ఈ చర్చకు దారి తీసింది.

అయితే కన్నడ నటుడు తారక్ పొన్నప్ప పుష్ప టు చిత్రంలో బుగ్గారెడ్డి పాత్రలో సినిమా చివర్లో కనిపించాడు హీరో అల్లు అర్జున్ చేతిలో హతం అయ్యే తారక్ వల్లప్ప గతంలో పలు కన్నడ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది అలాగే పలు చిత్రాల్లో నెగిటివ్ పాత్రల్లో కనిపించారు.

Sanjay Malhotra is New RBI Governor: ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్న ఐఏఎస్ అధికారి