రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం రేపు డిసెంబరు 10తో ముగియనుంది. శక్తికాంత దాస్ 2018 డిసెంబరు 12న బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం పూర్తయినప్పటికీ, మరికొన్నాళ్ల పాటు పదవీకాలం పొడిగించగా.. పొడిగించిన పదవీకాలం రేపటితో ముగియనుంది. కొత్తగా పదవీ బాధ్యతలు అందుకోబోతున్న సంజయ్ మల్హోత్రా ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 20 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన ఆమ్ ఆద్మీ, జంగ్‌పురా స్థానం నుండి బరిలో దిగనున్న మనీష్ సిసోడియా

సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సివిల్స్ రాసి ఐఏఎస్ అయిన సంజయ్ మల్హోత్రా... తన 33 ఏళ్ల కెరీర్ లో విద్యుత్, ఆర్థిక, పన్నులు, సమాచార సాంకేతికత, గనుల శాఖలో విధులు నిర్వరించారు.

Sanjay Malhotra is New RBI Governor: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)