Big Blow to Jani Master: జానీ మాస్టర్‌ కు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం

జానీ మాస్టర్‌ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.

Choreographer Jani Master (Photo-/X)

Hyderabad, Oct 7: లైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్‌ (Jani Master)కు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్‌ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 8న జానీ మాస్టార్ స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును (National Award) రద్దు చేశారు. జానీ మాస్టార్ కు ఇచ్చిన ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ అవార్డును నిలిపేస్తున్నట్టు వివరించింది.

వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన

కోర్టు బెయిల్ ఇచ్చినా..

తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ పై ఆరోపణలు ఎదురవ్వడంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఢిల్లీలో జాతీయ అవార్డును స్వీకరించాల్సి ఉన్నదన్న జానీ మాస్టర్‌ అభ్యర్ధనతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు ఆ అవార్డు రద్దవ్వడంతో బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం.. శబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు