Newdelhi, Oct 7: శ్రీవారి తిరుమల లడ్డూలో (Tirumala Laddu) కల్తీ జరిగిందన్న వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల అయ్యప్ప ప్రసాదం అరవణలో (Sabarimala’s Aravana Prasadam) కల్తీ జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రసాదంలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఈ అరవణ ప్రసాదాన్ని ఆలయ అధికారులు ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉన్నట్టు సమాచారం.
Amidst heightened tensions over the 'contaminated' laddus in #Tirupati, Sabarimala temple's prasadam or 'aravana' has also come into the limelight for containing 'high levels' of pesticide. The 'aravana' will now be converted into manure.https://t.co/DS3qAL6dgb
— Deccan Herald (@DeccanHerald) October 6, 2024
అసలేమైంది?
అరవణ ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు నిరుడు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ప్రసాదాన్ని వాడకుండా అలాగే నిలిపివేశారు.
ఎలా బయటపడింది?
అయితే, ఆ కల్తీ ప్రసాదాన్ని పారబోస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని గ్రహించిన టీడీబీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ ను ఇండియన్ సెంట్రిఫ్యుజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ పొందిందని, వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీబీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.