Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)
సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు.
Hyderabad, Oct 18: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’ (Pottel Movie). సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించింది. విమానంలో పొట్టేల్ పాంప్లేట్లు పంచుతూ హీరోయిన్ అనన్య నాగళ్ల, హీరో కృష్ణ కనిపించారు. ఈ ప్రమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ హీరోయిన్
ఖమ్మం ప్రాంతానికి చెందిన అనన్య నాగళ్ల 2019లో విడుదలైన ‘మల్లేశం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఆదరణ సొంతం చేసుకున్నారు. ‘ప్లే బ్యాక్’, ‘వకీల్ సాబ్’, ‘శాకుంతలం’ వంటి చిత్రాల్లో తన సహజ నటనతో నటించి మెప్పించారు.