Prabhas: పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్.. 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్

Prabhas

Amaravati, September 19: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు పదేళ్ల తర్వాత (After a Decade) తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) ఈ నెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభను (Condolence Meet) ఏర్పాటు చేస్తున్నారు.

తమిళ హీరోయిన్ ఆత్మహత్య, జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా! అంటూ సూసైడ్ నోట్, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నటి ప్రేమ వ్యవహారం, కొన్నాళ్లుగా ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటున్న హీరోయిన్

ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలావుంచితే, కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ప్రభాస్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.