Prem Chopra: స్టార్ నటుడిని బతికుండగానే చంపేశారు, నేను బతికున్నానంటూ మొరపెట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రా, తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన

చాలామంది అది నిజమేననుకుని అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ (Death Rumours) నివాళులు అర్పించారు. తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన చెందిన ప్రేమ చోప్రా తను ప్రాణాలతోనే ఉన్నానంటూ స్పందించాడు.

Prem and Uma Chopra (Photo Credits: Instagram

బాలీవుడ్ సీనియర్‌ నటుడు ప్రేమ్ చోప్రా (Prem Chopra) బతికుండగానే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు పుకారు లేపారు. చాలామంది అది నిజమేననుకుని అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ (Death Rumours) నివాళులు అర్పించారు. తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన చెందిన ప్రేమ చోప్రా తను ప్రాణాలతోనే ఉన్నానంటూ స్పందించాడు.

ఇలాంటి ప్రచారాలు మానుకొవాలని ఆయన వేడుకున్నారు. బాలీవుడ్‌ హిట్‌ సినిమాల్లో విలన్‌గా రాణించిన ఈ సీనియర్‌ నటుడు మీడియాతో మాట్లాడుతూ.. 'నన్ను బతికుండగానే చంపేస్తున్నారు. దీన్నే శాడిజం అంటారు. నేను ఇక లేనంటూ పుకారు లేపి ఎవరో రాక్షసానందం పొందుతున్నారు. కానీ నేను మీతో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. నాకు నిన్న ఉదయం నుంచి ఎన్నో ఫోన్ కాల్స్‌ వస్తున్నాయి.

మహిళల నగ్న చిత్రాలతో మగాళ్ల మనోభావాలు దెబ్బతినవా, సూటిగా ప్రశ్నించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై ముదురుతున్న వివాదం

సెలబ్రిటీ మిత్రులు ఫోన్లు చేసి అంతా బాగానే ఉంది కదా అని అడుగుతున్నారు. అసలు నేను చనిపోయానంటూ ఎవరు ప్రచారం చేస్తున్నారో (Prem Chopra dismisses death rumours) కూడా అర్థం కావడం లేదు. గతంలో నా ఆప్తమిత్రుడు జీతేంద్ర కూడా మరణించాడంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి' అని చెప్పుకొచ్చాడు.

కాగా ప్రేమ్‌ చోప్రా, అతడి భార్య ఉమ ఇద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్‌ బారిన పడటంతో ముంబై ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇద్దరూ డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ప్రేమ్‌ చోప్రా సినిమాల విషయానికి వస్తే అతడు దోస్తానా, క్రాంతి, జాన్వర్‌, షాహీద్‌, ఉపకార్‌, పురబ్‌ ఔర్‌ పశ్చిమ్‌, దో రాస్తే, కటి పతంగ్‌, దో అంజానే, జాదు తోనా, కల సోనా వంటి పలు సినిమాల్లో అలరించాడు.



సంబంధిత వార్తలు