NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.

President Murmu released NTR commemorative coin (photo-Video Grab)

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అదినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు.

చిన్నారిని అడిగి ఆటోగ్రాఫ్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన కాంగ్రెస్ నేత

కాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని విడుదల చేసింది. రూ.100 నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించబడింది. దీన్ని ఏదైనా బ్యాంకులో లేదా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ. 4,160 ఉంటుంది. నాణెంతో పాటు, తెలుగు ప్రైడ్‌గా పేరొందిన ఎన్టీఆర్‌ చరిత్రాత్మక జీవిత ప్రయాణాన్ని వివరించే నాలుగు పేజీల పుస్తకాన్ని కూడా కొనుగోలుదారులకు అందించనున్నారు.

Here's Video

నాణేనికి ఒకవైపు మూడు సింహాలు, అశోకచక్రం ఉండగా, మరో వైపు హిందీలో హిందీలో ‘నందమూరి తారక రామారావు శతజయంతి’ అని చెక్కబడిన ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సూచించేందుకు నాణెం 1923-2023 సంవత్సరాలతో గుర్తించబడింది.ఈ నాణాన్ని హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ముద్రించారు. 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులకే స్వయంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif