Pushpa-2 Pre-release Event: పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే.. హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు.
Hyderabad, Dec 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్ గా (Pushpa-2 Pre-release Event) విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు. ముంబై, కొచ్చి, చెన్నై, పాట్నా ప్రాంతాల్లో పుష్ప 2 స్పెషల్ ఈవెంట్స్ జరగ్గా.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇప్పుడు తెలుగు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2 ప్రీ-రిలీజ్ స్పెషల్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. యూసుఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వెనుక ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక మొదలు కానున్నది.
మూడు చోట్ల పార్కింగ్
ఈవెంట్ కు వచ్చే వారికోసం మూడు చోట్ల పార్కింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేయనున్నారు. జానకమ్మ తోట సవేరా ఫంక్షన్ హాల్ మహమూద్ ఫంక్షన్ హాల్ లో ఫ్యాన్స్ వాహనాల పార్కింగ్ కు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ నేపథ్యంలో నేడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు.
ఆంక్షలు ఇలా..
- జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
- మైత్రివనం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు యూసుఫ్ గూడా బస్తి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
- మైత్రివనం నుండి బోరబండ వెళ్లే వాహనాలు కృష్ణకాంత్ పార్క్ మీద మోతి నగర్ వైపు మళ్లిస్తారు.