Hyderabad, Dec 2: కీర్తీ సురేశ్ (Keerthi Suresh), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాంతి దత్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు సమాచారం. వాటాల పేరుతో కాంతి దత్ ఈ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో సెలబ్రిటీల చేత పెట్టుబడులు పెట్టించి అతను మోసగించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాంతి దత్ దాదాపు వంద కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఒక్కొక్కటిగా బయటపడుతున్న కాంతి దత్ నేరాల చిట్టా..
కాంతిదత్ మీద మాదాపూర్ పీఎస్ లో హిట్ అండ్ రన్ కేసు
జూలై 14న బెంజ్ కారుతో ర్యాపిడూ డ్రైవర్ ను గుద్దేసి పారిపోయిన కాంతి దత్
ఖతార్ కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ ను రూ. 6 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో నవంబర్ 15న సీసీఎస్ల… https://t.co/7Asp6iJ0tf pic.twitter.com/c4L9ZymD7H
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2024
అలా కేసు వెలుగులోకి..
నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి సమంత సన్నిహితురాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి కాంతి దత్ చేతిలో తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
నేరాల చిట్టా కూడా
కాంతిదత్ మీద మాదాపూర్ పీఎస్ లో హిట్ అండ్ రన్ కేసు ఒకటి నమోదైంది. జూలై 14న బెంజ్ కారుతో ర్యాపిడో డ్రైవర్ ను గుద్దేసి కాంతి దత్ ఉడాయించాడు. ఖతార్ కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ ను రూ. 6 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో నవంబర్ 15న సీసీఎఎస్ లో కూడా ఈయనపై చీటింగ్ కేసు నమోదైంది.