Mani-Rajani combo: 30 ఏళ్ల తరువాత ‘మణి’తో తలైవా! 'పొన్నియిన్ సెల్వన్' హిట్ తో ఫాంలోకొచ్చిన మణిరత్నం.. దిగ్దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్?!

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లలోను రజనీకాంత్ - మణిరత్నం మళ్లీ కలిసి పనిచేయలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

Rajanikanth (Credits: Twitter)

Chennai, October 14: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'దళపతి' (Dalapathi). మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ  సంచలనమే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లలోను రజనీకాంత్ - మణిరత్నం మళ్లీ కలిసి పనిచేయలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ రజనీకి మణిరత్నం లైన్ చెప్పడం .. రజనీ గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు.

నా చూపు కూడా అనుష్క ఫోటో మీదే, అందుకే పైనుంచి కిందకు చూశా, గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోని షేర్ చేసిన వర్మ, మీరు కూడానా బాహుబలిగారు అంటూ కొంటె వ్యాఖ్యలు

అప్పటి 'దళపతి' తెచ్చిన క్రేజ్ .. రీసెంట్ గా 'పొన్నియిన్ సెల్వన్' తెచ్చుకుంటున్న వసూళ్లు చూసే రజనీ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ 'జైలర్' సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఆయన యువ దర్శకులతో రెండు సినిమాలను లైన్లో పెట్టారు. అవి పూర్తి చేసేలోగా, 'పొన్నియిన్ సెల్వన్ 2'ను మణిరత్నం పూర్తి చేస్తారన్న మాట.