Rakesh Master And Prabhas Pic: ప్రభాస్‌కు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో, రాకేష్ మాస్టర్‌ తో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ ప్రాక్టీస్‌

ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ (Prabhas) కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు.

Rakesh Master And Prabhas Pic (PIC@ Twitter)

Hyderabad, June 18: టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (Rakesh Master died) కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ (Prabhas) కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు. అలా డాన్స్ నేర్పిస్తున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటోని షేర్ చేస్తూ అభిమానులు ఆయనని గుర్తు చేసుకుంటున్నారు.

కాగా రాకేష్ మాస్టర్ (Rakesh Master).. ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. కెరీర్ మొత్తంలో దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫర్‌గా పని చేశారు.

Rakesh Master Died: రాకేష్ మాస్టర్ చనిపోతాడని రెండు నెలల క్రితమే హెచ్చరించిన డాక్టర్లు, 15 రోజుల క్రితమే శిశ్యుడితో కలిసి చావుపై రాకేష్ మాస్టర్ వీడియో, గాంధీ ఆస్పత్రిలో బెడ్‌పై రాకేష్ మాస్టర్ చివరి క్షణాలు ఇవీ!(వీడియో) 

రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్‌ రామారావు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్‌లుగా సాగుతున్న జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) ఈయన దగ్గర శిష్యులుగా చేశారు. కాగా రాకేష్ మాస్టర్ చనిపోతారని రెండు నెలలు క్రిందటే డాక్టర్లు తెలియజేసినట్లు ఆయన అసిస్టెంట్‌ సాజిత్‌ మీడియాకి చెప్పుకొచ్చాడు. హనుమాన్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో మాస్టర్‌కు వాంతులు, విరోచనాలు అయ్యాయని, అప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా.. డాక్టర్లు ఆయన బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారట.